- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope (april 29) : ఈరోజు రాశి ఫలాలు
ఏప్రిల్ 29 పన్నెండు రాశుల వారికి గ్రహస్థితుల ఎలా ఉన్నాయిద. ఏ రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు తెలుసుకుందాం.

ఏప్రిల్ 29 పన్నెండు రాశుల వారికి గ్రహస్థితుల ఎలా ఉన్నాయిద. ఏ రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు తెలుసుకుందాం.
మేషం
ఉద్యోగంలో పనిభారం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మాత్రం స్థిరంగా సాగుతాయి. కుటుంబం నుంచి ఒత్తిడి ఉండొచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాలి.
వృషభం
పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. స్నేహితులకు సహాయం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం
కొత్త బాధ్యతలు రావచ్చు. కొత్త ఆలోచనలతో లాభాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. విదేశీ అవకాశాలపై శుభవార్తలు రావచ్చు.
కర్కాటకం
ఇబ్బందులు తగ్గి మానసికంగా రిలీఫ్ కలుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్త వాహనం యోగం కూడా ఉండొచ్చు.
సింహం
పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల వల్ల ఒత్తిడి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
కన్యా
పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం ఉన్నా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబం నుంచి మిశ్రమ వార్తలు రావచ్చు. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు.
తులా
ఇది మంచి రోజుల్లో ఒకటి. ఉద్యోగంలో మంచి వార్తలు వస్తాయి. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కూడా ఉండొచ్చు. కొత్త పరిచయాలు కలుగుతాయి.
వృశ్చికం
పనిలో కొంత ఒత్తిడి ఉన్నా ముందుకు సాగుతారు. ఖర్చులను నియంత్రించాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆర్థికంగా క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది.
ధనుస్సు
పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మకరం
ఉద్యోగంలో మార్పులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు లాభం ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.
కుంభం
పనిలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకరం. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
మీనం
కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.






