Today's Horoscope : ఈరోజు రాశి ఫలాలు ( ఏప్రిల్ 28)

by Batti.Sumithra |

ఈరోజు ఏరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Todays Horoscope : ఈరోజు రాశి ఫలాలు ( ఏప్రిల్ 28)
X

మేష రాశి

ఉద్యోగంలో ఉన్నతాధికారులు మాత్రమే కాకుండా సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది. వ్యాపారాల్లో మార్పులు చేపట్టి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లలు అభివృద్ధి సాధిస్తారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. ఆస్తి సమస్యలు క్రమంగా పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడి మంచి వార్తలు వింటారు.

వృషభం రాశి

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారాల్లో బిజీగా గడుస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యల వల్ల పనులు ఆలస్యం కావచ్చు. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది.

మిథున రాశి

ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణపై ఆలోచనలు చేస్తారు. గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. స్నేహితులతో సమావేశాలు జరుగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు కలుగుతాయి. ఆహారంలో జాగ్రత్త అవసరం. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి

ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది కానీ పనిభారం ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తక్కువగా లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి.

సింహ రాశి

ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల వంటి మంచి వార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ప్రయాణాలు చేస్తారు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య రాశి

మీ పనికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. పిల్లలు మంచి అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

తుల రాశి

ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం సాధారణంగా సాగుతుంది. వ్యాపారాలు కొద్దిగా నెమ్మదిస్తాయి. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది.

ధనుస్సు రాశి

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు వస్తాయి. కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం స్థిరంగా ఉంటాయి. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి

ఉద్యోగం, వ్యాపారం ఉత్సాహంగా సాగుతాయి. పనుల్లో విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభదాయకంగా మారుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక లాభాలు వస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి.

కుంభ రాశి

ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. లాభాలు ఆశించినంతగా రాకపోవచ్చు. అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం లభిస్తుంది. సన్నిహితులతో చిన్న విభేదాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది.

మీన రాశి

బాధ్యతలు పెరగడంతో విశ్రాంతి తగ్గుతుంది. కుటుంబంలో ఒత్తిడి ఉండవచ్చు. పనులు ఆలస్యంగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆహారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

Next Story