- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల అప్‌డేట్స్: 29 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు
తిరుమలలో 29 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.72 కోట్లు!

దిశ, వెబ్ డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రానికి భక్తులు తాకిడి కొనసాగుతుండగా.. మంగళవారం రద్ధీ కాస్త తగ్గింది. ఈ రోజు (జూలై 7, 2026) ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి (Free Darshan) సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం (Rs 300 ticket) భక్తులకు 3 నుండి 4 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే సోమవారం రోజున 81,692 మంది భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మొక్కుబడిగా స్వామివారికి కల్యాణకట్ట లో 35,361 మంది భక్తుల తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా లభించిన నగదు కానుకల ఆదాయం రూ. 4.72 కోట్లుగా నమోదైందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి వున్న వారికి నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు, తాగు నీరు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.






