- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్ జోష్‌లో దుషారా విజయన్.. కొత్త ప్రాజెక్ట్ ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్
‘కొత్త కథ.. కొత్త ప్రపంచం.. కొత్త భావోద్వేగాలు.. ఇది ఇప్పుడే ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది’ అంటూ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ దుషారా విజయన్ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘ఎగ్జామ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుని, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అదే జోష్ కొనసాగిస్తున్న ఆమె నటించిన 'జీడిఎన్ నాయుడు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరసన ‘మకుటం’ చిత్రంలో కూడా దుషారా హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇలా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్న దుషారా విజయన్, తాను నటిస్తున్న ఈ రెండు పెద్ద సినిమాలు ఇంకా విడుదల కాకముందే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.
ఈ విషయాన్ని దుషారా ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ‘కొత్త కథ.. కొత్త ప్రపంచం.. కొత్త భావోద్వేగాలు.. ఇది ఇప్పుడే ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది’ అంటూ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కోలీవుడ్ ప్రముఖ దర్శకులు హెచ్. వినోద్, ఆధిక్ రవిచంద్రన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు హెచ్. వినోద్ ఈ కొత్త సినిమాకు క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రేజీ సినిమాకు రాజు జయమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్, ఆర్జె బాలాజీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని పాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. వరుస హిట్లు అందుకుంటున్న దుషారా విజయన్ ఖాతాలో ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా చేరడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






