Tirumala Update: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

by Kema Shiva Kumar |

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Tirumala Update: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 10 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 10 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 63,637 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,016 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.2 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story