- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 73,324 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లుగా నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి క్షేత్రంలో భక్తుల సందడి ఈ రోజు కూడా కొనసాగుతోంది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పాటు విద్యా సంవత్సరం పూర్తవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 6 గంటల సమయం పడుతోంది.
మంగళవారం (ఏప్రిల్ 21) ఒక్కరోజే మొత్తం 73,324 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని 22,955 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా లభించిన నగదు ఆదాయం రూ. 3.89 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు.






