తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

by Malleboina Mahesh |

ఓ వైపు చలి, మరోవైపు వర్షాలు కురుస్తున్నప్పటికి తిరుమల కొండపై భక్తుల రద్ధీ తగ్గడం లేదు. వీక్ ఎండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు.

తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు చలి, మరోవైపు వర్షాలు కురుస్తున్నప్పటికి తిరుమల కొండపై భక్తుల రద్ధీ (Crowd of devotees) తగ్గడం లేదు. వీక్ ఎండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల పురవీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం తెల్లవారు జామునే తిరుమల శ్రీవారి దర్శనం (Srivari darshan) కోసం భక్తులు పోటెత్తారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తులు 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే శ్రీవారిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ (TTD) ప్రకటించింది. వారిలో 25,559 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లుగా నమోదైంది. భక్తులు తమ వసతి, దర్శన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు ప్రయాణం సాగించాలని టీటీడీ కోరుతోంది. అలాగే వైకుంఠ ద్వార దర్శనాలు, టోకెన్లకు సంబంధించిన వివరాలను సైతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్న పిల్లులు, వయో వృద్ధులు వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు.

Next Story