చాలా రోజుల తర్వాత రిలీఫ్.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-01 03:10:18  IST  )

చాలా రోజుల తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

చాలా రోజుల తర్వాత రిలీఫ్.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా రోజుల తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మరో 10 కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. టోకెన్లు లేకుండా కంపార్టుమెంట్లలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నవారికి.. శ్రీవారి దర్శనానికి 12 గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది. రూ.300 టోకెన్లు పొందిన భక్తులకు 2-3 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. కాగా.. నిన్న (ఆదివారం) స్వామివారిని 90,826 మంది భక్తులు దర్శించుకోగా.. 42,747 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. 3.99 లక్షల లడ్డూలను విక్రయించారు. 2.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

Next Story