Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది.

Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామి వారిని 73,543 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 21,346 మంది భక్తలు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story