Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ తగ్గింది.

Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 10 సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది.

ఇక శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 9 కంపార్ట్‌మెంట్లు భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 57,665 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 20,051 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.2.73 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story