తిరుమలలో గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంతసమయమంటే..

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే.. నేటికి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది.

తిరుమలలో గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంతసమయమంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే.. నేటికి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. సోమవారం ఉదయం 21 కంపార్టుమెంట్లలో భక్తులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 16 కంపార్టుమెంట్లకు తగ్గింది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుందని, రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాల్లో మార్పులుంటాయని టీటీడీ వెల్లడించింది. నిన్న (సోమవారం) 83,382 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 34,083 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు సమకూరింది. 3.97 లడ్డూలను లడ్డూ కౌంటర్ల ద్వారా విక్రయించారు.

Next Story