Tirumala: 25 కంపార్టుమెంట్లలో భక్తులు.. సేవా టికెట్ల బుకింగ్ విడుదల

by Naga Rani Yarlagadda |

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. స్థానిక దేవాలయాల సేవా టికెట్లను విడుదల చేసింది.

Tirumala: 25 కంపార్టుమెంట్లలో భక్తులు.. సేవా టికెట్ల బుకింగ్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఏడు కొండలపై కొలువై ఉన్న తిరుమలేశుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వెళ్తున్నారు. ప్రతీరోజూ వేలాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ పేర్కొంది. ఉదయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-5 గంటలు, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న (మంగళవారం) స్వామివారిని 74,902 మంది భక్తులు దర్శించుకోగా.. 22,869 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు సమకూరింది.

మార్చి నెలకు సంబంధించి స్థానిక దేవాలయాల సేవా టికెట్ల బుకింగ్స్ ను టీటీడీ ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. అలిపిరి సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ఉదయం 10 గంటలకు విడుదల చేయగా.. కొద్దినిమిషాలకే కోటా పూర్తైంది. స్థానిక దేవాలయాల సేవా టికెట్లు సైతం హాట్ కేకుల్లా బుక్కయ్యాయి.

Next Story