- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి 10 గంటల సమయం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఓ మోస్తరుగా తరలి వచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 4 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 10 కంపార్ట్‌మెంట్లు భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 88,497 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 29,054 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.34 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.






