- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల కంపార్టుమెంట్లు ఆల్‌మోస్ట్ ఫుల్... దర్శన సమయాలపై టీటీడీ ట్విస్ట్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు స్లాట్ కేటాయించిన సమయానికి ముందు లేదా ఆలస్యంగా వస్తే క్యూలైన్లలోకి అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో నాలుగు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. దాదాపు కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. బుధవారం ఉదయానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12-14 గంటల సమయం పడుతుందని టీటీడీ సిబ్బంది తెలిపారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు మారుతాయని తెలిపింది. నిన్న (మంగళవారం) స్వామివారిని 73,572 మంది భక్తులు దర్శించుకోగా.. 22,747 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
స్లాట్ సమయంలోనే దర్శనం..
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ట్విస్ట్ ఇచ్చింది. ఇకపై సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను వారికి స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూలైన్లలోకి అనుమతిస్తామని పేర్కొంది. స్లాట్ సమయంకంటే ముందు గానీ, ఆలస్యంగా గానీ వస్తే.. వారిని అనుమతించబోమని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం.. అంటే మార్చి 16వ తేదీ నుంచి తిరుమలలో ఈ నిబంధన అమల్లోకి రానుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండే ఇబ్బందుల్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వివరించింది.






