Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనానికి 24 గంటల సమయం

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనానికి 24 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 5 నుంచి 6 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిక్కిరిపోయి.. క్యూలైన్ శిలాతోరణం వరకు ఉంది. ఆదివారం స్వామి వారిని 83,412 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 33,058 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామి వారి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story