- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
New Year 2026:ఈ ఏడాది ఉగాది ఎప్పుడంటే..? ముఖ్యమైన పండుగల తేదీలివే!
కొత్త ఏడాది(2026) ప్రారంభమైంది.

దిశ,వెబ్‌డెస్క్: కొత్త ఏడాది ప్రారంభమైంది. న్యూ ఇయర్‌కి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్సహంగా స్వాగతం చెప్పారు. ఈ నేపథ్యంలో హిందూ పంచాంగం ప్రకారం 2026లో రాబోయే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, పర్వదినాల తేదీలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. న్యూ ఇయర్ స్టార్ట్ కాగానే మొదటగా గుర్తొచ్చేది సంక్రాంతి. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఏ పండుగలు ఏ ఏ తేదీల్లో వస్తున్నాయి. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి? అని నూతన క్యాలెండర్‌ను చూస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా నవరాత్రి, దీపావళి వంటి పండుగల తేదీలు ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ తరుణంలో 2026 ఏడాదిలో ముఖ్యమైన పండుగల తేదీలు ఇప్పుడు తెలుసుకుందాం..
జనవరి 14(బుధవారం): భోగి(Bogi) పండుగ
జనవరి 15(గురువారం): మకర సంక్రాంతి (Makar Sankranti )
జనవరి 16(శుక్రవారం): కనుమ పండుగ(Kanuma)
ఫిబ్రవరి 15(ఆదివారం): శివరాత్రి
మార్చి 3(మంగళవారం): హోలీ
మార్చి 19(గురువారం): ఉగాది
మార్చి 21(శనివారం):రంజాన్
మే 27(బుధవారం): బక్రీద్
జూన్ 26(శుక్రవారం): మొహర్రం
ఆగస్టు 10(సోమవారం): బోనాలు
సెప్టెంబర్ 04(శుక్రవారం): కృష్ణాష్టమి
సెప్టెంబర్ 14(సోమవారం): వినాయకచవితి
అక్టోబర్ 20(మంగళవారం): దసరా నవరాత్రి ఉత్సవాలు
నవంబర్ 9(సోమవారం): దీపావళి పండుగ
NOTE: పైన తెలిపిన సమాచారం మత విశ్వాసాలు, పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే.






