- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే, భక్తులు కూడా ఆ ఆలయం ఆచార సంప్రదాయాల ప్రకారమే మొక్కలు మొక్కుకుని చెల్లిస్తుంటారు. ఉదాహరణకు తిరుపతి వెళ్తే తల నీలాలు సమర్పించటం, మేడారం వెళ్తే బెల్లాన్ని బంగారంగా నివేదించటం, అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ చేయటం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ మనందరికి తెలిసిన విషయాలే.. అయితే, తమిళనాడులోని ఓ ఆలయంలో మాత్రం వింత ఆచారం ఉంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రంలోని దిండిటల్ జిల్లా ఒట్టన ఛత్రం సమీపంలో వలయపట్టి మహాలక్ష్మి అమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే, ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకునే విధానం ప్రమాదకరంగా ఉంటుంది. భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ పగలగొడతారు. ఈ ప్రక్రియలో భక్తుల తలకు గాయాలు కూడా అవుతుంటాయి. గాయాలైన వారికి చికిత్స అందించేందుకు వైద్య బృందాన్ని కూడా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. గత వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని, ఈ వేడుకను ఆది పెరుక్కు వేడుకగా పిలుస్తారని భక్తులు చెబుతున్నారు.
పురాణ కథనం ప్రకారం.. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి భక్తులు.. కొబ్బరికాయను తమ తలపై కొట్టడం ప్రారంభించారు. అది చూసిన శివుడు ప్రసన్నుడై భక్తుల ముందు ప్రత్యక్షమై వారి కోరికను నెరవేర్చాడని చెబుతారు.






