Kadamba trees : ఈ వృక్షాల‌ను సంర‌క్షిస్తే.. ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించిన‌ట్టే..!

by Nallavelli.Anjaneyulu |

Kadamba trees : దేవ‌తా వృక్షాలుగా పిలువ‌బ‌డే వృక్షాలు క‌దంబ వృక్షాలు. వీటి గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. కాశీ పుణ్యక్షేత్రం త

Kadamba trees : ఈ వృక్షాల‌ను సంర‌క్షిస్తే.. ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించిన‌ట్టే..!
X

Kadamba trees : దేవ‌తా వృక్షాలుగా పిలువ‌బ‌డే వృక్షాలు క‌దంబ వృక్షాలు. వీటి గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. కాశీ పుణ్యక్షేత్రం తరువాత ఒక్క త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఎరుపు రంగులో ఉండే కదంబ పూలు విశేషంగా భక్తులను ఆకర్షిస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఈ వృక్షాలను సాక్షాత్తూ పార్వతీదేవి స్వరూపంగా భావించి మహిళలు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కదంబవాసినిగా పేరున్న పార్వతీదేవి ఈ వృక్షాల దగ్గర వనవాసం చేశారని ప్రతీతి.. నిత్యం పచ్చగా ఉండే ఈ వృక్షాలను సంరక్షించడం అంటే ధర్మాన్ని పరిరక్షించడమే అని వేద‌ పండితులు చెబుతుంటారు.

దేవతావృక్షాల్లో ప్రథమస్థానం ఈ కదంబవృక్షాలదే చెప్ప‌వ‌చ్చు. ప్రకాశంజిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో గతంలో ఈ వృక్షాలు ఎక్కువగా కనిపించేవి. కానీ రాను రాను వీటి సంఖ్య తగ్గిపోవడంతో ఆలయ నిర్వాహకులు, పండితులు ఈ వృక్షాలను సంరక్షించడంతో తిరిగి వీటి సంఖ్య పెరిగింది. అమ్మవారి ఆలయం చెరువు కట్టపై కదంబ వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాశీ పుణ్యక్షేత్రం తర్వాత కదంబ వృక్షాలు త్రిపురాంతకంలోని అమ్మవారి ఆలయ పరిసరాల్లోనే ఉన్నాయని స్థలపురాణాలు, చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బాల త్రిపురసుందరీదేవి అమ్మవారు కదంబవాసిని కావడం వల్లే ఇవి ఎక్కువగా ఇక్కడే కనిపిస్తాయని చెబుతారు.

Next Story