Hanuman: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే..!

by Phanindra |

అత్యంత శక్తివంతమైన దేవులలో హనుమంతుడు కూడా ఒకరు.

Hanuman: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు , రాశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అత్యంత శక్తివంతమైన దేవులలో హనుమంతుడు కూడా ఒకరు. మన ఇళ్ళలో ఏదైన పనులు మొదలు పెట్టే ముందు హనుమాన్ ను పూజించడం ఆనవాయితిగా వస్తోంది. హిందు పురాణాల ప్రకారం, ప్రతి మంగళవారం ఆయనను భక్తితో పూజిస్తారు. కొందరు మంగళవారం ఉపవాసం ఉండి ఆయన అనుగ్రహం పొందుతారు. ఇతర దేవుళ్ళకు ఇష్టమైన రాశులు ఎలా ఉన్నాయో హనుమంతుడికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సింహ రాశి

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఈ రాశి వారిపై హనుమంతుడి అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే, ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. కాబట్టి, ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ వెళ్ళి పూజించడం చాలా మంచిది.

మేష రాశి

మేష రాశివారి పై ఆంజనేయుడు అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు ధైర్యాన్ని పొందడమే కాకుండా అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. హనుమాన్ ను పూజిస్తే జీవితంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. దీంతో పాటు కష్టాలు కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story