- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026లో 13 మాసాలు ఉండబోతున్నాయి.. ఎందుకో తెలుసా?
వచ్చే ఏడాది అంటే 2026లో 12 కు బదులు 13 మాసాలు ఉండబోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే ఏడాది అంటే 2026లో 12 కు బదులు 13 మాసాలు ఉండబోతున్నాయి. వినడానికే వింతగా ఉన్నప్పటికీ.. అది నిజం. మరి దీనికి గల కారణం ఏమిటంటే.. హిందూ చంద్రమాన క్యాలెండర్‌లో వచ్చే "అధిక మాసం"మేనట. చంద్ర సంవత్సరం సుమారు 354 రోజులు మాత్రమే ఉండటం వల్ల, సూర్య సంవత్సరంతో పోలిస్తే ప్రతి సంవత్సరం దాదాపు 11 రోజుల తేడా వస్తుంది. ఈ తేడా పెరుగుతూ పోతే పండుగలు, రుతువులు, వ్యవసాయ కాలాలు సరిగా ఉండవు. అందుకే మూడు సంవత్సరాలకు ఒకసారి చంద్ర–సూర్య చక్రాలను సమం చేయడానికి ఒక అదనపు మాసాన్ని చేర్చుతారు.
ఆ నెలను అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం అంటారు. 2026లో ఈ అధిక మాసం రావడంతో ఆ సంవత్సరంలో మొత్తం 12 కాకుండా 13 మాసాలు ఉంటాయి. ఇది సహజమైన ఖగోళ గణిత ప్రక్రియ మాత్రమే కాకుండా తెలుగు సంవత్సరాది క్యాలెండర్ సమతుల్యత కోసం జరిగే మార్పుగా పండితులు చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ పురుషోత్తమ మాసంలో పూజలు, దానాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని అంటున్నారు. అయితే ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టకపోవడం గమనార్హం.






