Sun Transit 2025: మార్చి 15 న సూర్యుడి సంచారం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

by Phanindra |

ప్రతి నెల సూర్యుడు రాశి సంచారం చేస్తుంటాడు.

Sun Transit 2025:  మార్చి 15 న సూర్యుడి సంచారం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి నెల సూర్యుడు రాశి సంచారం చేస్తుంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఏడాదిలో సూర్యుడు 12 గ్రహాలను కలుస్తాడు. అందువలనే సూర్యగ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడిని గౌరవం, సంతోషం, శ్రేయస్సుకు సూచిక గా చెబుతారు. కాబట్టి, ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా అది అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉండగా, మార్చి 15వ తేదీన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మీన రాశి

సూర్యుడి సంచారం వలన ఈ రాశి వారు ఎన్నో ప్రయోజనాలు పొందనున్నారు. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. అలాగే, వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పెళ్లి కానీ వారికీ వివాహం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భారీ లాభాలు రావడంతో కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి.

ధనస్సు రాశి

సూర్యుడి సంచారం వలన ధనస్సు రాశి వారు అనేక లాభాలు పొందనున్నారు. పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. అంతే కాదు, ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాత కాలంలో కొన్న భూములకు రేట్లు పెరుగుతాయి. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కలిసి కలిసి వస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృ వీకరించడం లేదు.

Next Story