- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం.. పైగా రెండో శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం.. పైగా రెండో శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. శనివారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ నిండి బయట క్యూలైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12-15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే టోకెన్లు ఉన్న భక్తులకు 4-5 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతుందని తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది.
ఇక నిన్న (శుక్రవారం) 69,842 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,234 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






