- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నేటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు, వీకెండ్ కావడంతో భక్తులు..

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు, వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. ఆదివారం ఉదయానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు ఉన్న భక్తులకు 8 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (శనివారం) 91,147 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.31కోట్లు వచ్చింది.
వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆరోజు వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. 30 నుంచి జనవరి 8వరకూ భక్తులకు వైకుంఠ ద్వారదర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తొలి మూడురోజులు ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నారు. ఆ తర్వాత ముందు వచ్చిన వారికి ముందుగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా టోకెన్ల సిస్టమ్ ను తీసివేసినట్లు టీటీడీ తెలిపింది. నేటి నుంచి జనవరి 7వ తేదీ వరకూ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లజారీని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది.






