- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండగపూట తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. పర్వదినం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ (Crowd of devotees) భారీగా కొనసాగుతోంది. పర్వదినం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. అలాగే వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. దీంతో సోమవారం తెల్లవారుజామున తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది.
శ్రీవారి దర్శనానికి 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగింది. నిన్న 84,017 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ. 4.97 కోట్లుగా నమోదైంది. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా తిరుమలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.






