- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్‌లోనూ భక్తులు వేచిఉన్నారు. దీంతో శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం అర్థరాత్రి వరకు స్వామివారిని 75,096 మంది భక్తులు దర్శించుకోగా, 36,262 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ(Srivari Hundi) ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఒక భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని తెలిపారు.
Next Story






