- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
by Yella Dhawani Reddy |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయానికి(Tirumala Tirupati Devasthanam) భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయానికి(Tirumala Tirupati Devasthanam) భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగియనుండటంతో స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున నుంచే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. కాగా మంగళవారం స్వామివారిని 80,894 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32,508 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకలతో శ్రీవారి హుండీల ద్వారా టీటీడీకి రూ.4.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
Next Story






