- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
by Yella Dhawani Reddy |
వేసవి సెలవులు కావటంతో కలియుగ దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు కావటంతో కలియుగ దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 80,964 మంది స్వామివారిని దర్శించుకోగా 32,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
Next Story






