- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు. గత వారం రోజుల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో తిరుమల కొండకు తరలివస్తున్నారు. దీంతో బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. అలాగే, వైకుంఠ క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక మంగళవారం అర్థరాత్రి వరకు శ్రీవారిని 78,631 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story






