- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా విద్యాసంస్థల సెలవులు ముగిసే సమయం రావడంతో పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుపతి కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇక శుక్రవారం అర్థరాత్రి వరకు ఏడుకొండలవాడిని 71,721 మంది భక్తులు దర్శించుకోగా, 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కాగా, తిరుమలలో జూన్ 2 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 1వ తేదీన సాయంత్రం అంకురార్పణం చేయనున్నారు.






