Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

by Yella Dhawani Reddy |

వేసవి సెలవులు కావటంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు కావటంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని బయట శిలతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,579 మంది స్వామివారిని దర్శించుకోగా 34,067 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.74 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.

ఆగష్టు నెల టికెట్లు విడుదల

ఇక ఇవాళ ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల అవుతాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల అవుతాయి. అలాగే శనివారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.

Next Story