- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wedding: మాఘ మాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయంటే?
శుభాకార్యాలకు, పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం. ఎందుకంటే ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలో ఉండవని పండితులు, పురోహితులు చెబుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: శుభాకార్యాలకు, పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం. ఎందుకంటే ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలో ఉండవని పండితులు, పురోహితులు చెబుతుంటారు. అంతేకాదు, ఈ మాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే.. దాంపత్య జీవితం నిండు నూరేళ్ల పాటు సుఖ, సంతోషాలతో ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఇక జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెళ్లి బజాలు మోగనున్నాయి. ఇక ఈ నెల 31 నుంచి మార్చి 16 వరకు మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయన్నారు. అలాగే జూన్ అర్థ మాసంలో ఆషాడ మాసం రావడంతో ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మళ్లీ మంచి ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. ఈ సంవత్సరంలో దాదాపు పెళ్లి ముహూర్తాలు అనేవి బాగానే ఉండటంతో ఎన్నో జంటలు పెళ్లి పీటలు ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మంచి ముహూర్తాలివే..
* ఫిబ్రవరి: 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25
* మార్చి: 1, 2, 6, 7, 12
* ఏప్రిల్: 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
* మే: 1, 5, 6, 8, 15, 17, 18
* జూన్: 1, 2, 4, 7






