చివరి రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా చక్రస్నాన క్రతువు

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి చక్రస్నానం (Chakra Snanam) క్రతువును ఆయన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

చివరి రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా చక్రస్నాన క్రతువు
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి చక్రస్నానం (Chakra Snanam) క్రతువును ఆయన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం అత్యంత వైభవోపేతంగా కొనసాగింది. అనంతరం శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజన కార్యక్రామాన్ని చూడ ముచ్చటగా నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండటానికి స్వామి వారికి చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రతువులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడు (BR Naidu), ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (EO Anil Kumar Singhal), బోర్డు స‌భ్యులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు

Next Story