నేటితో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం.. పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం

by Kema Shiva Kumar |

శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి పరిసమాప్తం కానున్నాయి.

నేటితో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం.. పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి పరిసమాప్తం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలను కనులారా తిలకించేందకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకున్నారు. పెద్దశేష వాహనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు ఉదయం, సాయంత్రం సమయాల్లో తిరు మాఢవీధుల్లో శ్రీవారు రోజుకో వాహనంపై ఆ వేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. అయితే, బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కావడంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

స్వామి వారు శ్రవణా నక్షత్రంలో అర్చావతారంలో భూలోకంలో ఆవిర్భవించడంతో నేటి రోజును పుణ్య దినంగా భావిస్తారు. అదేవిధంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు, చక్రతాళ్వారులను వరహ స్వామి వారిని ముఖ మండపానికి తీసుకువస్తారు. ఆ తర్వాత ఉభయ దేవేరులతో నున్న శ్రీవారి సరసన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీవారిని పవిత్ర జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. ఉ.6 నుంచి 9 గంటల మధ్య వరాహ పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవ క్రతువు నిర్వహించునున్నారు. ఈ చక్రస్నానం జరిగిన రోజున పుష్కరణిలో భక్తులు స్నానాలు చేస్తే సకలమైన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. రాత్రి 7 గంటలకు ఉభయదేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. రాత్రి 7.30కి ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

Next Story