Today Panchangam: తెలుగు పంచాంగం .. ఈ రోజు శుభ, అశుభ సమయాలు ఇవే!

by Jakkula.Mamatha |

ఈ రోజు(మార్చి 19, 2026) గురువారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.

Today Panchangam: తెలుగు పంచాంగం .. ఈ రోజు శుభ, అశుభ సమయాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఏదైనా శుభకార్యం లేదా దూర ప్రయాణాలకు బయలుదేరే ముందు చాలా మంది ఇవాళ సమయం ఎలా ఉంది. నూతన పనులకు ఈరోజు మంచిదేనా? అసలు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందని పంచాంగ నిపుణులను సంప్రదించడం లేదా క్యాలెండర్‌లో చూస్తుంటారు. ఇదిలా ఉంటే.. విశ్వావసు నామ సంవత్సరం ముగిసి ఈ రోజు నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.

ఈ తరుణంలో ఇవాళ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా చాలా మంది శుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయని పంచాంగ నిపుణులను సంప్రదిస్తుంటారు. ఈ తరుణంలో ఈ రోజు(మార్చి 19, 2026) గురువారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు. శుభ సమయం, వర్జ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం, సూర్యోదయం, యమగండం వంటి వివరాలు కూడా చూడవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి ఇక్కడ తెలుసుకోండి.

సూర్యోదయం సమయం : తె. 06:24 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:23 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

తిథి

అమావాస్య ఉ.6:53 వరకు ఉంటుంది. పాడ్యమి మరుసటి రోజు(రేపు) తె.4:52 వరకు ఉంటుంది.

ఈరోజు శుభ సమయాలు

బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 04:48 గంటల నుంచి ఉదయం 05:36 గంటల వరకు ఉంటుంది.

అమృత కాలం సమయం: రా.11:31 నుండి రా.1:02 వరకు ఉంటుంది.

అభిజిత్ ముహూర్తం సమయం : మ.12:00 నుండి మ.12:48 వరకు ఉంటుంది.

ఈ రోజు అశుభ సమయాలు

వర్జ్యం: మ.2:26 నుంచి మ.3:57 వరకు ఉంటుంది.

యమగండం సమయం: ఉ.6:24 నుండి ఉ.7:54 వరకు ఉంటుంది.

దుర్ముహూర్తం సమయం :ఉ.10:24 నుంచి ఉ.11:12 వరకు ఉంటుంది. మ.3:11 నుంచి మ.3:59 వరకు ఉంటుంది.

రాహుకాలం సమయం : మ.01:53 నుంచి మ.3:23 వరకు ఉంటుంది.

గుళికాకాలం సమయం : ఉ.9:24 నుంచి ఉ.10:54 వరకు ఉంటుంది.

Next Story