- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు.. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం
by Kema Shiva Kumar |
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి స్వల్ప సమయం పడుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టోకెన్లు లేని భక్తులు 10 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ముందుగా పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల్లోపే అవుతోంది. బుధవారం స్వామివారిని 63,772 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,013 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న స్వామివారి హుండీకి రూ.1.47 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






