ధనస్సు రాశిలోకి సూర్యుడి సంచారం.. ఈ ఐదు రాశులవారిని ధనవంతుల్ని చేస్తుంది

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-08 02:09:42  IST  )

డిసెంబర్ 16న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు.

ధనస్సు రాశిలోకి సూర్యుడి సంచారం.. ఈ ఐదు రాశులవారిని ధనవంతుల్ని చేస్తుంది
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 16న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తా. ఇది ధనస్సు రాశివారి జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. సంవత్సరంలో ఈ సంచారం 5 రాశులవారికి అదృష్టాన్ని తీసుకొస్తుందని జ్యోతిష్కులు చెప్తున్నారు. ఈ రాశులవారి వ్యాపారం, సంపద, ఆరోగ్యం ప్రయత్నంగానే మార్పులు వస్తాయి.

మేషరాశి

వీరికి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా అమ్మాలని ప్రయత్నిస్తున్న ఆస్తులు త్వరగా అమ్ముడవుతాయి. తోబుట్టువులతో హెల్దీ రిలేషన్షిప్ మెయింటేన్ చేయాలి.

సింహరాశి

ఈ రాశివారికి ఆర్థిక లాభాలు సాధ్యమే. టీమ్ లో ఒకరిగా పనిచేయడం వల్ ప్రయజనం ఉంటుంది. మీ గురించి మాత్రమే ఆలోచించడం వల్ల పరిస్థితులు మారుతాయి. పరిచయాలు మెరుగుపడతాయి. సామాజికంగా కుటుంబం పురోగతిని సంపాదిస్తుంది.

తులారాశి

ఈ రాశివారు వ్యాపారంలో ఉంటే మంచి పురోగతికి ఇది సరైన ఛాన్స్. వ్యాపార సామర్థ్యం పెరుగుతుంది. కష్టపడి పనిచేసే ఉద్యోగులు శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.

ధనస్సు రాశి

ఖర్చులు తగ్గుతాయి. కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి. ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మకరరాశి

ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ నిర్వహణలో జాగ్రత్త అవసరం. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. మంచి వ్యాపారంలో పెట్టుబడికి ఇది సరైన సమయం.


Read More..

త్రిదశాంక యోగం 2025: ఏడాది చివరినాటికి మూడు రాశులవారికి శుభయోగం

Next Story