నూతన సంవత్సరం తొలిరోజే నక్షత్రం మారనున్న సూర్యుడు.. ఈ రాశులవారికి అంతా శుభమే

by Naga Rani Yarlagadda |

నేటితో 2025 ముగియనుంది. ఎన్నో జ్ఞాపకాలు, కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నారు.

నూతన సంవత్సరం తొలిరోజే నక్షత్రం మారనున్న సూర్యుడు.. ఈ రాశులవారికి అంతా శుభమే
X

దిశ, వెబ్‌డెస్క్: నేటితో 2025 ముగియనుంది. ఎన్నో జ్ఞాపకాలు, కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నారు. 2026 తొలిరోజునే జ్యోతిష్యంలో కీలక మార్పు జరగనుంది. తొలిరోజునే సూర్యడు నక్షత్రం మారనున్నాడు. పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి ప్రవేశిస్తాడు. గతంలో ఇదే నక్షత్రంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. 2026లోనూ ఈ మార్పు జరగనుండగా.. కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలుగనున్నాయి.

వృషభరాశి

సూర్యుడు పూర్వాషాఢ నక్షత్రంలో రెండవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల వృషభరాశికి అదృష్టం కలిసి రానుంది. దీనివల్ల కొత్త అవకాశాలు పెరుగుతాయి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. ఆగిపోయిన నిధులు, ఇతరులకు ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. వ్యాపారవృద్ధికి అనుకూలంగా ఉంటుంది. తండ్రి సపోర్టుతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తిలో తోటి వాటి సహాయం పొందుతారు.

కర్కాటక రాశి

సూర్యుడి స్థానంలో ఈ మార్పు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ ఆఫర్ రావొచ్చు. పదోన్నతి, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ పై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకుంటారు.

సింహరాశి

సూర్యుడు తన స్థానం, నక్షత్రం మారడం వల్ల సింహరాశికి శుభ ఫలితాలు కలుగుతాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్లో ఎదుగుతారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సృజనాత్మక రంగాలపై ఆసక్తి పెరుగుతుంది.

Next Story