- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తజన సందోహం.. శిలాతోరణం వరకూ క్యూలైన్
తిరుమలలో వేసవి సెలవుల ప్రభావం కనిపిస్తోంది. కొండపై భక్తజన సందోహం నెలకొంది. స్వామివారి దర్శనార్థం శిలాతోరణం వరకూ క్యూలైన్ ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. నిన్నటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో.. ఫ్యామీలీలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండకు తరలి వస్తున్నారు. దీంతో కొండపై భక్తజన సందోహం కనిపిస్తోంది. టోకెన్లు లేకుండా స్వామివారి ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా.. శిలాతోరణం వరకూ క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 4-6 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటల్లో స్వామివారి దర్శనం జరుగుతుందని తెలిపారు. నిన్న (శుక్రవారం) స్వామివారిని 69,270 మంది భక్తులు దర్శించుకోగా.. 33,180 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.






