- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srisailam: శ్రీశైలం హుండీ ఆదాయం లెక్కింపు.. ఒక్క నెలలో ఎంత ఆదాయం వచ్చిందంటే?
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం (Srisailam) భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం (Srisailam) భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా దేవస్థానానికి హుండీల ద్వారా రూ.3,61,42,016 నగదు ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అలాగే, 105 గ్రాముల బంగారం, 4.860 కిలోల వెండి సైతం వచ్చిందని చెప్పారు. ఇక 644 యూఎస్ డాలర్లు (US Dollers), 50 సౌదీ అరేబియా రియాల్స్, ఒకటి కువైట్ దినార్, 115 యూఏఈ దిర్హమ్స్, 670 యూకే పౌండ్స్, 54 సింగపూర్ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 40 సౌత్ ఆఫ్రికా రాండ్స్, ఐదు ఘనాయన్ సెడీ, 2000 సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్, వంద ఒమన్ బైసా తదితర విదేశీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయన్నారు. ఈ మొత్తం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు హుండీల ద్వారా సమకూరినట్లు వెల్లడించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టినట్లు వివరించారు.






