Tirumala: తిరుపతిలో వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం వేడుకలు

by Yella Dhawani Reddy |

తిరుపతిలో (Tirupati) శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

Tirumala: తిరుపతిలో వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో (Tirupati) శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9.15 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు (Devotees) రథాన్ని లాగారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది. శుక్రవారం (ఏప్రిల్ 4) ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది.

Next Story