రేపు మహాలయ అమావాస్య.. స్వయంపాకంలో వీటిని ఇస్తే.. పితృదేవతలు తృప్తి చెందుతారు

by Naga Rani Yarlagadda |

పితృపక్ష అమావాస్య.. అదే మహాలయ అమావాస్య. ఈరోజున పితృదేవతలను తలచుకుని దానమిస్తే..

రేపు మహాలయ అమావాస్య.. స్వయంపాకంలో వీటిని ఇస్తే.. పితృదేవతలు తృప్తి చెందుతారు
X

దిశ, వెబ్‌డెస్క్: పితృపక్ష అమావాస్య.. అదే మహాలయ అమావాస్య. ఈరోజున పితృదేవతలను తలచుకుని దానమిస్తే.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. కొందరు మాత్రం దేవుడున్నాదన్నది నిజమైతే.. ఇవి కూడా నిజమేనని చెప్తుంటారు.

మహాలయ అమావాస్య రోజున పితృ దేవతలు వాయురూపంలో వారి ఇళ్లకు వచ్చి.. సూర్యాస్తమయం వరకూ ఉండి.. తమవారు చేసే దాన ధర్మాలు, అన్నదానాలను చూసి తృప్తి చెంది వారిని ఆశీర్వదించి వెళ్తారని గరుడపురాణం చెప్తోంది. ఏడాది పొడవునా నెలకొక అమావాస్య చొప్పున 12 అమావాస్యలు వస్తాయి. ఆరోజుల్లో పితృదేవతలకు శ్రాద్ధం చేయకపోయినా.. మహాలయ అమావాస్య నాడు శాస్త్రోక్తంగా చేయాలని పండితులు సూచిస్తున్నారు. అన్నం, నీరు, పాలు, కందమూలములు, పండ్లు వీటిలో వేటినైనా పితృదేవతలకు సమర్పించవచ్చు. ఇవి చేయలేకపోతే తిల తర్పణం, అదీ కుదరకపోతే నదులు, సముద్రాలు లేదా బావులు, చెరువుల్లో స్నానాలు ఆచరించి పితృస్తుతి చేసి జల తర్పణం ఇవ్వొచ్చు.

ఇక బ్రాహ్మణులకు ఇచ్చే స్వయంపాకంలో నిత్య భోజనానికి సంబంధించిన సరుకులను ఇవ్వాలని చెప్తున్నారు. ఉప్పు, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా వాటిలో కందమూలాలను ఇవ్వవచ్చు. స్వయంపాకం ఇచ్చేశక్తి లేనివారి తమశక్తి మేరకు నగదును దక్షిణగా ఇవ్వొచ్చు. అదీ కుదరకపోతే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసినా చాలు. పితృదేవతలు తృప్తి చెంది.. ఆశీర్వచనం ఇస్తారని ప్రతీతి.

Next Story