నక్షత్రం మారుతున్న శుక్రుడు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-09 00:37:00  IST  )

శుక్ర గ్రహాన్ని సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. జాతకంలో శుక్రయోగం ఉంటే వారికి ఇక తిరుగులేదని..

నక్షత్రం మారుతున్న శుక్రుడు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: శుక్ర గ్రహాన్ని సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. జాతకంలో శుక్రయోగం ఉంటే వారికి ఇక తిరుగులేదని జ్యోతిష్కులు కూడా చెప్తుంటారు. జాతకంపై అంతటి ప్రభావాన్ని చూపే శుక్రుడు నక్షత్రాన్ని మార్చుకుటున్నాడు. డిసెంబర్ 9న శుక్రుడు.. బుధుడు పాలించే జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడ. డిసెంబర్ 20వ తేదీ వరకూ ఈ నక్షత్రంలోనే ఉంటాడు. శుక్రుడి నక్షత్ర పరివర్తన.. నాలుగు రాశులవారికి ఆకస్మిక ధనయోగాన్ని ప్రసాదించనుంది. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడుల పరంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది.

మిథున రాశి

జ్యేష్ఠ నక్షత్రలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా శుభప్రదంగా ఉంటుంది. మెరుగైన సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు వృత్తిలో ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ జీవిత భాగస్వామిని విలువైన బహుమతితో సంతోషపెడతారు. కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి

కన్యరాశివారికి శుక్రుడి నక్షత్ర పరివర్తన శుభప్రదంగా ఉంటుంది. జీవితం ప్రేమ, ఆనందంతో నిండుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. మానసిక సంతృప్తి లభిస్తుంది. కుటుంబంతో సామరస్యంగా ఉంటారు. డిసెంబర్ 9 నుంచి 20 మధ్య కాలం సంపద, శ్రేయస్సుకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి మారుతుండటం, ఈ మార్పు వృశ్చిక రాశిలో జరగడం జీవితంలో కొనసాగుతున్న సవాళ్లను తగ్గిస్తుంది. కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. కానీ.. ఆరోగ్యం పటల అజాగ్రత్త తగదు.

మీన రాశి

మీనరాశివారికి వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పెద్ద సమస్య నుంచి బయటపడటంతో బిగ్ రిలీఫ్ దక్కుతుంది. ఆర్థిక విషయాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. పెట్టుబడి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలు చేపడుతారు.

Next Story