ముగిసిన సరస్వతీ పుష్కరాలు.. ఆర్టీసీ ఆదాయం ఎంతంటే?

by Yella Dhawani Reddy |

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మహా పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని సరస్వతీ పుష్కరాలు సోమవారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి.

ముగిసిన సరస్వతీ పుష్కరాలు.. ఆర్టీసీ ఆదాయం ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మహా పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaram in Kaleshwaram) సోమవారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో (Triveni sangamam) పుణ్యస్నానాలు ఆచరించారు. 12 రోజుల పాటు సాగిన సరస్వతీ పుష్కరాళ్లకు దాదాపు 30 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక పుష్కరాళ్లు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ (RTC) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను (Special buses) ఏర్పాటు చేసింది. ఈ బస్సుల ద్వారా సంస్థకు 12 రోజుల్లో రూ. 8 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి వరంగల్‌‌‌‌లోని తొమ్మిది డిపోలతో పాటు కరీంనగర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు వరంగల్‌‌‌‌ రిజియన్‌‌‌‌ పరిధిలోని ఆర్టీసీ బస్సుల ద్వారా 8,419 ట్రిప్పులు నడుపగా.. మొత్తం 4,63,691 మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు. పుష్కరాలు ప్రారంభమైన మొదట్లో బస్సుల్లో రోజుకు 7 వేల మంది ప్రయాణించగా.. 23న ఒక్కరోజే 49,757 మంది జర్నీ చేశారు. ఇక 24న 68,575, 25న 68,473 మంది, చివరి రోజైన సోమవారం 65 వేల మంది బస్సుల్లో ప్రయాణం చేశారని ఆఫీసర్లు తెలిపారు.

Next Story