తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |

తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. కొత్తగా టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి వెళ్లేవారికి స్వామివారి దర్శనం 12 గంటల్లో జరుగుతుందని పేర్కొంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-4 గంటలు, రూ.300 స్పెషల్ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న(ఆదివారం) 80,021 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా..25,894 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీ కానుకలు రూ.3.90 వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

కాగా.. 2026 జనవరి నెలకు సంబంధించి.. టీటీడీ ట్రస్టులు, స్కీమ్ దాతలకు స్వామివారి దర్శనం, వసతి టికెట్ల బుకింగ్ ఈరోజు 11.30 గంటలకు విడుదల కానుంది. అలాగే స్థానిక దేవాలయాల సేవా టికెట్ల బుకింగ్ ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

Next Story