తిరుమలలో రికార్డ్ స్థాయిలో దర్శనాలు.. మళ్లీ పోటెత్తిన భక్తులు

by Malleboina Mahesh |

తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుస సెలవుల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ఆగస్టు 15 నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.

తిరుమలలో రికార్డ్ స్థాయిలో దర్శనాలు.. మళ్లీ పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుస సెలవుల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ఆగస్టు 15 నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగిపోయింది. ముఖ్యంగా శనివారం శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పట్టింది. అనంతరం ఆదివారం కూడా భక్తుల రద్ధీ కొనసాగింది. అయితే టీటీడీ అధికారులు పటిష్టమైన చర్యలతో నిన్న ఒక్కరోజు రికార్డు స్థాయిలో 86,364 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం కూడా భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజ వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.నిన్న శ్రీవారిని మొత్తం 86,364 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 30,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా టీటీడీకి రూ.4.46 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Next Story