Chandra Gochar: సూర్యుడు పాలించే రాశిలోకి చంద్రుడు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!

by Phanindra |

ఈ ప్రభావం కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే, మరి కొన్ని రాశులకు ప్రతి కూలంగా ఉంటుంది.

Chandra Gochar: సూర్యుడు పాలించే రాశిలోకి చంద్రుడు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అలాగే, ఏదైనా గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే, మరి కొన్ని రాశులకు ప్రతి కూలంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. త్వరలో చంద్రుడు ( moon ) ఎంతో శక్తివంతమైన సూర్యుడు ( sun ) పాలించే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం రెండు రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యలు ( Astrologers) చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మిథున రాశి ( mithuna rashi )

చంద్రుడు సంచారం వలన మిథున రాశి వారికీ అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు ( Astrologers ) చెబుతున్నారు. అలాగే, వీరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. భార్య, భర్తల మధ్య గొడవలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పని చేస్తున్న ఆఫీసులో జీతం పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది.

సింహ రాశి (simha rashi)

చంద్రుడు సంచారం సింహ రాశి వారిపై కూడా పడుతుంది. ఈ సమయంలో అనుకున్న పనులను పూర్తి చేస్తారు . ఉద్యోగాల్లో కొత్త మార్పులు వస్తాయి. ముఖ్యంగా, వీరు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. అలాగే, గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి డబ్బులు పొందుతారు. కోర్టు సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగం కోసం చూసే వారికీ కొత్త ఉద్యోగం వస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story