- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మేష రాశి
ఈరోజు ఈ రాశి వారికి ఖాళీ సమయం దొరుకుతుంది. స్నేహితుల సహాయంతో ఆర్థిక సమస్యలు కొంత తగ్గుతాయి. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో గడుపుతారు కానీ మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. దాంపత్య జీవితం ఈ రోజు రొమాంటిక్‌గా ఉంటుంది.
వృషభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్య సమస్య వల్ల ఒక పని వాయిదా పడొచ్చు. బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సామాజిక కార్యక్రమాల్లో మంచి పేరు వస్తుంది. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేయాలని అనిపిస్తుంది. రోజు ప్రారంభం ఉత్సాహంగా ఉంటుంది.
మిథున రాశి
ఈరోజు ఈ రాశి వారికి వ్యక్తిగత సమస్యల వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది. ఇంటి పెద్దల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి కానీ ఎంపికలో జాగ్రత్తగా ఉండండి. సామాజిక కార్యక్రమాల్లో ఆకర్షణగా నిలుస్తారు. దాంపత్య జీవితం బాగుంటుంది.
కర్కాటక రాశి
ఈరోజు ఈ రాశి వారు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ప్రేమ, స్నేహం మరింత బలపడతాయి. ప్రయాణ అవకాశాలు కనిపించవచ్చు. భాగస్వామితో సరదాగా గడుపుతారు.
సింహ రాశి
ఈరోజు ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభం ఇస్తాయి. సోదరుల నుంచి సహాయం లభిస్తుంది. ప్రేమలో ఆనందకరమైన ఆశ్చర్యం ఎదురవుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
కన్యా రాశి
ఈరోజు ఈ రాశి వారు ఆనందంగా, రిలాక్స్ అయ్యే పనుల్లో పాల్గొంటారు. తోబుట్టువులకు డబ్బు అప్పు ఇవ్వాల్సి రావచ్చు. ప్రేమలో మంచి అనుభూతులు ఉంటాయి. ప్రకృతి మధ్యలో నడకలు చేయడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
తుల రాశి
ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై శ్రద్ధ చూపించడం అవసరం. డబ్బు ఆశించినంతగా రాకపోవచ్చు. కుటుంబం, పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రియమైన వారితో మాటల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ బంధాల విలువ తెలుసుకుంటారు.
వృశ్చిక రాశి
ఈరోజు ఈ రాశి వారి ఆరోగ్యం బలహీనంగా ఉండటంతో పని పై దృష్టి తగ్గవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహాయం ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలు లాభదాయకంగా మారవచ్చు. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈరోజు ఈ రాశి వారికి స్వీయాభివృద్ధికి ఇది మంచి రోజు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. ప్రేమలో కొంత నిరాశ ఉండవచ్చు. కార్యాలయంలో ఒత్తిడి రావచ్చు. దాంపత్య బంధం మాత్రం బలంగా ఉంటుంది.
మకర రాశి
ఈరోజు ఈ రాశి వారు మీ కష్టానికి కుటుంబ సహకారం లభించి మంచి ఫలితాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. ప్రేమలో నమ్మకం పెరుగుతుంది. రోజు ప్రారంభంలో వచ్చిన వార్తలు కొంత మనసును కలచవచ్చు.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి వారు యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ప్రయాణంలో వస్తువుల పై జాగ్రత్త అవసరం. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. భాగస్వామితో చిన్న అపోహలు వచ్చినా చివరికి సర్దుకుంటాయి. పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది.
మీన రాశి
ఈరోజు ఈ రాశి వారు స్నేహితుల సహాయం వల్ల సంతోషంగా ఉంటారు. ప్రారంభంలో కొంత ఆర్థిక నష్టం ఉండవచ్చు. వ్యక్తిగత రహస్యాలు బయట పెట్టకండి. చాలా కాలం తర్వాత భాగస్వామితో శాంతియుతంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.






