మహా శివరాత్రి ఎఫెక్ట్.. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |

ప్రముఖ పుణ్యక్షేతం, జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం ఒకే చోట ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

మహా శివరాత్రి ఎఫెక్ట్.. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేతం, జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం ఒకే చోట ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవ్వగా.. శివ స్వాములు, భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు శ్రీశైల దేవస్థానానికి క్యూ కట్టారు. వేకువజాము నుంచే స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజైన నేడు.. ద్వారకా తిరుమల ఆలయం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందనున్నాయి. రాత్రికి పురోహితులు.. ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

Next Story