mahashivaratri 2025: మహాశివుడికి సోమవారం ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!

by Vennela |

mahashivaratri 2025: శివుడి(lord shiva)ని సోమవారం భక్తిశ్రద్ధలతో పూజిస్తే, చంద్రుడిలా కష్టాల నుండి బయటపడి, జీవితం మళ్లీ ఉజ్వలంగా మారుతుందని పురాణ సారం.

mahashivaratri 2025: మహాశివుడికి సోమవారం ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: mahashivaratri 2025: శివుడి(lord shiva)ని సోమవారం భక్తిశ్రద్ధలతో పూజిస్తే, చంద్రుడిలా కష్టాల నుండి బయటపడి, జీవితం మళ్లీ ఉజ్వలంగా మారుతుందని పురాణ సారం.

సోమవారం శివుని(lord shiva)కి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు భక్తిశ్రద్ధలతో ఆయనను పూజిస్తే అనేక శుభఫలితాలు లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. శివుడు భక్తుల పిలుపుకు వెంటనే స్పందిస్తాడని, ఆయనను ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని చెప్పబడుతుంది. ముఖ్యంగా సోమవారం శివుని పూజ చేస్తే జీవితంలో సౌభాగ్యం, ఆనందం, క్షేమం కలుగుతాయని ప్రజల నమ్మకం.

చంద్రుడు-శివుడు మధ్య ఆసక్తికరమైన కథ

చంద్రుని సోమవారం(monday) పట్ల గాఢమైన సంబంధం ఉంది. పురాణాల ప్రకారం, దక్ష మహారాజుకు 27 మంది కుమార్తెలుండగా, చంద్రుడు వారందరినీ వివాహం చేసుకున్నాడు. కానీ రోహిణిని ఎక్కువ ప్రేమించడంతో మిగిలిన భార్యలు అసంతృప్తితో తమ తండ్రి దక్షుని వద్ద ఫిర్యాదు చేశారు. దక్షుడు చంద్రుడిని హెచ్చరించినా, అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీనితో కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రుడికి శాపం పెట్టాడు, దీని ప్రభావంతో చంద్రుడు క్రమంగా తేజస్సును కోల్పోయాడు.

తన ఉనికికి ముప్పు పొంచివుందని గ్రహించిన చంద్రుడు బ్రహ్మదేవుని ఆశ్రయించాడు. బ్రహ్మ చంద్రునికి శివుని ప్రార్థించమని సూచించాడు. చంద్రుడు అఖండ భక్తితో శివుడిని ఆరాధించాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, చంద్రునికి తిరిగి తేజస్సు లభించేలా వరం అనుగ్రహించాడు. అయితే, దక్షుని శాప ప్రభావం కారణంగా, చంద్రుడు నెలలో పదిహేను రోజులు క్రమంగా క్షీణించి అమావాస్యనాటికి మాయమవుతాడు. మరికొన్ని రోజుల్లో శివుని వరం వల్ల మళ్లీ ప్రకాశిస్తూ పౌర్ణమి నాటికి సంపూర్ణంగా వెలుగుతాడు.

మహాశివరాత్రికి కౌంట్ డౌన్:

మహాశివరాత్రి(mahashivaratri 2025) ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తిధినాడు జరుపుకునే పవిత్ర ఉత్సవం. ఈ రాత్రి శివపార్వతుల వివాహ మహోత్సవాన్ని సూచిస్తుందని, మరో కథ ప్రకారం శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైన దినంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర రోజున భక్తులు ఉపవాసం పాటిస్తూ, రాత్రంతా జాగరణ చేసి శివుడిని అభిషేకాలు, పూజలతో ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తే, ఆ శివుని కృపతో పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున భక్తులు 'ఓం నమ.. శివాయ' మంత్రాన్ని జపించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది. మహాశివరాత్రి శివుని మహిమను తలచి, భక్తితో నిమగ్నమై ఆయన కృపకు పాత్రులవ్వాల్సిన పవిత్ర తిధి.

Next Story