నడి సముద్రంలో నారాయణుడు.. మత్స్యకారుల వలలో చిక్కి .. !

by Seetharam |   (  Updated:2023-06-27 06:00:39  IST  )

నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారులకు ఓ వింత అనుభవం ఎదురైంది.

నడి సముద్రంలో నారాయణుడు.. మత్స్యకారుల వలలో చిక్కి .. !
X

దిశ, వెబ్‌డెస్క్: నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఎప్పటిలాగే చేపలకోసం వల వేయగా నడి సముద్రంలో వారికి నారాయణుడి విగ్రహం ముఖభాగం వలలో పడింది. దీంతో ఒక్కసారిగా మత్స్య కారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇలా నడి సముద్రంలో విగ్రహం దొరకడం ఏంటని ఈ అద్భుతాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు చెప్పారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.

అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడులోని చిన్నకాల్పట్టు గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు పుదుచ్చేరి నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే వలకు ఉన్నట్టుండి ఒక్కసారే దేవుడి విగ్రహం చిక్కింది. విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story